మహిళా అభ్యుదయమే సమాజ అభ్యుదయము
జీ న్యూస్ హుజూరాబాద్
సమాజం బాగుండాలంటే మహిళలు అభివృద్ధిలోకి రావాలని కిట్స్ ఇంజనీరింగ్ సింగాపురం సెక్రటరీ వి సతీష్ కుమార్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాలలో పనిచేస్తున్నారన్నారు. వైద్యులు, ఇంజనీర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు మొదలగువృత్తులు మాత్రమే కాకుండా సాంకేతిక శాస్త్రీయ రంగాలలో ముందంజలో ఉన్నారన్నారు. ఈ కాలంలో జరుగుతున్న ఇంజనీరింగ్ అడ్మిషన్లు, మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో బాలికలు అధిక సంఖ్యలో ఎంపిక అవుతున్నారని, రాబోయే సమాజానికి ఒక మంచి సంకేతమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ కళాశాలలో చదువులో మాత్రమే కాకుండా బాలికలు అన్ని కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటున్నారన్నారు. కళాశాల ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, హ్యుమానిటీస్ అండ్ సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ కె మధులత మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర గురించి వివరించారు. ఉపాధి,శిక్షణ అధికారిని డాక్టర్ కే విజయలక్ష్మి మాట్లాడుతూ బాలికలు అధిక సంఖ్యలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ అకాడమిక్స్ డాక్టర్ జి మల్లయ్య, కళాశాల రిజిస్టర్ డాక్టర్ వి రాజేశ్వరరావు, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శశికళ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు రంగాలలో గుర్తింపు సాధించిన అధ్యాపకురాళ్లను, ఇటీవల డాక్టరేట్ అందుకున్న మహిళా అధ్యాపకులను సన్మానించారు. మహిళ అధ్యాపకు లకు అంత్యాక్షరి, మెహందీ మొదలగు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
మహిళా అభివృద్దితోనే సమాజ అభివృద్ది
