డిప్యుటీ డీఎంఆండ్​హచ్​ఓ కు వాకర్స్ కమిటీ సన్మానం

Must read

 

 

డిప్యుటీ డీఎంఆండ్​హచ్​ఓ కు వాకర్స్ కమిటీ సన్మానం

జీ న్యూస్​ హుజూరాబాద్

హుజూరాబాద్ డిప్యుటీ డీఎంఆండ్​హచ్​ఓ ​ గా నియమితులైన డాక్టర్​ శ్రావణ్​ కుమార్​ ను గురువారం హుజూరాబాద్​ వాకర్స్ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్థానికుడైన శ్రావణ్ కుమార్​ వైద్యుడిగా నిరుపేదలకు గొప్ప సేవలు అందించాడన్నారు. వైద్య సేవలతో పాటు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమాలు నిర్వహించాడన్నారు. డివిజన్​ పరిధిలో చాలా మంది యువకులకు కళాకారులుగా అవకాశాలు కల్పించి వెలుగులోకి తెచ్చాడని ప్రశంసించారు. అందరితో కలివిడిగా ఉండే శ్రావణ్​ విధి నిర్విహనలో ఖచ్చితత్వంతో తనదైన శైలిలో రాణించి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తాడన్నారు. ఈ సందర్బంగా ఆయను శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి అభింనదనలు అందజేశారు. కార్యక్రమంలో వాకర్స్ కమిటీ కార్యదర్శి మతిన్​, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఉపాద్యక్షులు యాదగిరి, సాయి, సంయుక్త కార్యదర్శి సంపత్​, గౌరవ సలహాదారు సృజన్​ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article