హుజూరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
.మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే సత్యం,ఇంచార్జి వొడితల ప్రణవ్..
– అట్టహాసంగా మున్సిపల్ చైర్మెన్ పదవి స్వీకరణ కార్యక్రమం.
– దశాబ్దాల తర్వాత హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం సంతోషం.ప్రణవ్ ను అభినందిస్తున్న.
– ఎన్నికల వరకే రాజకీయం,తర్వాత అభివృద్దే మా ధ్యేయం.
– అంబేద్కర్ చౌక్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ..
– హాజరైన మంత్రి పొన్నం,చొప్పదండి ఎమ్మెల్యే సత్యం,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్.
– భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు.
జీ న్యూస్ హుజురాబాద్:
ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం రోజున హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి మంత్రి పొన్నం, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మార్గ మద్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు రాజేశ్వర్ రావు,జగ్ జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కొన్నేళ్ళ నుండి హుజురాబాద్ ప్రాంతంతో మంచి సంబంధాలు కలిగిన పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతానికి పెద్దన్న పాత్ర పోషించాలని ఎంపీగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని,అటు హుస్నాబాద్ ఇటు హుజురాబాద్ ను రెండు కళ్లతో చూస్తూ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. డిసీసీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హయంలో హుజురాబాద్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేశామని ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ లో పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని,ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తున్నామని రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సొంతం చేసుకుంటుందని నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ పాలకవర్గానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ హుజురాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ సహకరిస్తామని తన మాటగా ప్రత్యేకంగా చెప్పారని,ఎన్నికల వరకే రాజకీయాలని,ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం 300 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చారని,ఎంపీ సహకారంతో అభివృద్ధి చేస్తామని,మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం దోహదం చేస్తోందని అన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని,ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఒక్కో హామీని నెరవేరుస్తున్నాం అన్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని,పర్యావరణం పచ్చదనంగా ఉంటేనే మానవ మనుగడ బాగుంటుందన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపులను ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేస్తున్నామని,ప్రజలంతా అన్ని రకాల టెస్టులు చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలని అన్నారు.వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటించి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్,మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సయ్యద్,మున్సిపల్ అధికారులు,30 వార్డులు కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
