అవకాశం ఇవ్వండి అభివృద్ది చేసి చూపిస్తా…ఎన్నం లక్ష్మీ ప్రకాష్

Must read

అవకాశం ఇవ్వండి అభివృద్ది చేసి చూపిస్తా..
ఎన్నం లక్ష్మీ ప్రకాష్
49వ డివిజన్​లో ఎగరనున్న బీజేపి జెండా 
జీ న్యూస్​ కరీంనగర్​
ఒక్కసారి అవకాశం ఇవ్వండి..49వ డివిజన్​ను అభివృద్ది చేసి చూపిస్తానని బీజేపి పార్టీ 49వ డివిజన్​ అభ్యర్థి ఎన్నం లక్ష్మీ ప్రకాష్​ ఓటర్లను కోరారు. గత పాలకులు ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఎక్కడి సమస్యలను అక్కడే వదిలేశారన్నారు. డివిజన్​లో అభివృద్ది చేసి కార్పోరేషన్​లోనే ఆదర్శంగా ఉండేలా పాటుపడతానన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తానన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమర్​ అండతో కేంద్రం నుండి నిధులు తీసుకు వచ్చి అభివృద్ది చేస్తానన్నారు. వారంలో ఒకరోజు డివిజన్​లో ప్రజావేధిక ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 49వ డివిజన్​ ప్రజలు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతూ లక్ష్మీ ప్రకాష్​ను గెలిపిస్తామని హామీ ఇస్తుండటంతో 49వ డివిజన్​లో బీజేపి జెండా ఎగరటం ఖాయం కనిపిస్తుందని తెలస్తుంది….

More articles

Latest article