బేష్ మిత్రబృందం….
1988–89 హైస్కూల్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల రక్తదానం

జీ న్యూస్ హుజూరాబాద్
పూర్వ విద్యార్థుల సామాజిక సేవను చూసి పలువురు బేష్ మిత్రబృందం అంటూ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనటం ద్వార వీరు ఆందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు…1988–89 హైస్కూల్ బ్యాచ్ విద్యార్థులు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్, సచిన్ మార్నింగ్ వాకర్స్ కందుగుల, ఎస్సెస్సీ 1988–89 హైస్కూల్ బ్యాచ్ ఆద్వర్యంలో కందుగుల గ్రామంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు రక్తదానం చేశారు. రక్తదాతలకు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి, గోలి సురేష్, గంగిశెట్టి రాజు, రాజలింగారెడ్డి, శనిగరపు నరేందర్, మాగంటి శ్రీదర్, బీఎస్ఆర్ శ్రీనివాస్, సర్ధార్ దల్జిత్ సింగ్, సంపత్ రావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


