సామాజిక సేవ రంగాలలో ప్రతిభకు పురస్కారం

Must read

సామాజిక సేవ రంగాలలో ప్రతిభకు పురస్కారం

వలస సుభాష్ చంద్రబోస్ 

జీ న్యూస్ సిద్దిపేట

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 పురస్కరించుకొని ఘనంగా నిర్వహిస్తున్నట్టు వలస సుభాష్ చంద్రబోస్  తెలిపారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువజన సంఘాలకు, మహిళా సంఘాలకు రాష్ట్రస్థాయి సంకల్ప యువ పురస్కారం అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.  30 సంవత్సరాల వయసుగల యువజన సంఘాలకు మహిళా సంఘాలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.  యువజన మహిళ సంఘాల ద్వారా వారు చేసిన సామాజిక సేవ రంగాలలో ప్రతిభ కలిగిన వారికి రాష్ట్రస్థాయి సంకల్ప యువ పురస్కార్ అవార్డులు ప్రధానం చేస్తున్నట్టు తెలిపారు.యువజన మహిళా సంఘాలు దరఖాస్తు చేసే వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాల ఫోటోలు ప్రెస్ క్లిప్పింగులు వారికి వచ్చిన మెరిట్ సర్టిఫికెట్లు దరఖాస్తు కు జత చేయాలన్నారు.  యువజన మహిళ సంఘాలు సామాజిక సేవ చేసిన వివిధ రంగాలలో నైపుణ్యం గల వారి వద్ద ఉన్న ఫోటోలు ప్రెస్ క్లిప్పింగ్ మెరిట్ సర్టిఫికెట్లు ఆధారంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రాష్ట్రస్థాయిలో సంకల్ప యువ పురస్కార్ అవార్డులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. దరఖాస్తు చివరి తేదీ 15.1.2026 రోజు వరకు సాయంత్రం ఐదు గంటల లోపు ప్రత్యేక్షంగా… పోస్ట్ ద్వారా కానీ దరఖాస్తులు కింద పేర్కొన్న అడ్రెస్స్  లో   చేసుకోవాలన్నారు.

వలస సుభాష్ చంద్ర బోస్,  సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ..ఇంటి నెంబర్ 2-92.  గ్రామము. కూరెల్ల…మండలం కోహెడ. జిల్లా సిద్దిపేట .పిన్ నెంబర్ 505473.

 

More articles

Latest article