మా గ్రామ సమస్యలు పరిష్కరించండి

Must read

మా గ్రామ సమస్యలు పరిష్కరించండి

జి న్యూస్ లోకేశ్వరం

లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ దడిగే జయలలిత భోజన్న సోమవారం నిర్మల్ జిల్లా రెవెన్యూ సంస్థల అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి అబ్దుల్లాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను విన్నవించారు.  గ్రామకంఠం, గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రెండో విడత లో ఇందిరమ్మ ఇండ్లలు అందేలా చూడాలని అదనపు కలెక్టర్ కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన అడిషనల్​ కలెక్టర్​ గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని గ్రామకంఠంతోపాటు. రెండో విడతలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు. అనంతరం భారీ మెజారిటీతో గెలుపొందిన అబ్దుల్లాపూర్ సర్పంచ్ దడిగే జయలలిత భోజన్నకు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article