రాధాస్వామి సత్సంగం కు స్టీల్ ప్లేట్ల పంపిణీ
జీ న్యూస్ హుజురాబాద్

గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాధాస్వామి సత్సంగ్‌లో శనివారం ప్లేట్లు పంపిణీ చేశారు. హుజురాబాద్ మండల కేంద్రంలోని రాధాస్వామి సత్సంగంలో ప్రతి శని, ఆదివారాలలో హైదరాబాద్ వాస్తవ్యులు శంకర్ లాల్, ముకుంద లాల్ లు అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నారు. కార్యక్రమ నిర్వహణ నిమిత్తము 50 స్టీల్ ప్లేట్లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ సత్సంగం చైర్మన్ మురికి రవీందర్ కు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మురికి రవీందర్ మాట్లాడుతూ శంకర్‌లాల్,ముకుంద లాల్ గత పది సంవత్సరముల నుండి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని అభినందించారు. మధురమ్మ ట్రస్ట్ వారు భోజనములు చేయుటకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోయల్ కార్ దుర్గాజి, మునిగంటి నాగరాజ్, తిరునగరి రమేష్, తాళ్లపల్లి రమేష్, చింత అనిల్ కుమార్, భోజనం చేయడం వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.
