49వ వార్డ్ కార్పోరేటర్ ఎన్నం లక్ష్మీ-ప్రకాష్​లకు సన్మానం

Must read

49వ వార్డ్ కార్పోరేటర్ ఎన్నం లక్ష్మీ-ప్రకాష్​లకు సన్మానం

జీ న్యూస్​ కరీంనగర్​

ఇటీవల జరిగిన కార్పోరేషన్​ ఎన్నికలలో 49వ వార్డ్ కార్పోరేటర్​గా గెలిచిన ఎన్నం లక్ష్మీ ప్రకాష్​ దంపతులను ఆదివారం ఎస్​ఈఎస్​ డిగ్రీ కళాశాల సహ విద్యార్థులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు శాలువాతో ఎన్నం లక్ష్మీ ప్రకాష్ దంపతుల​ను సన్మానించారు. వారు మాట్లాడుతూ ఎన్నం లక్ష్మీ ప్రకాష్​ ఎంతో కాలంగా రాజకీయాలలో రానిస్తున్నాడన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదవారికి తనకు తోచిన విదంగా సాయం అందిస్తూ తన సహాదయాన్ని చాటుకున్నాడన్నారు. రానున్న కాలంలో మరింత ఉన్నతంగా ఎదగాలని, ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మిత్రులు షహజాద్​​ హుస్సేన్​, నదీం, గుర్రం శ్రీనివాస్, అమర్​, కండెం శ్రీదర్​, రాజి రెడ్డి, శ్రీదర్​ రెడ్డి, ముని ప్రసాద్​, రేగురి లక్ష్మణ్​, చంద్రశేఖర్​ రెడ్డి, ఉప్పు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.  

More articles

Latest article