సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పది

Must read

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పది
– కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
– టిడబ్ల్యూజేఎఫ్ డైరీని ఆవిష్కరించిన కలెక్టర్.

జీ న్యూస్ కరీంనగర్
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) 2026 డైరీ ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీని తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరు భాద్యతగా ఉండాలని అందులో తానుకూడా ముందు వరుసలో ఉంటానని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ లకు టిడబ్ల్యూజేఎఫ్ డైరీ ని ఫెడరేషన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడు బాపూరావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టిడబ్ల్యూజెఎఫ్ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రవీంద్ర, జిల్లా కార్యదర్శి కుడుతాడు బాపూరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article