ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలిచేవారు జర్నలిస్టులు.

Must read

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలిచేవారు జర్నలిస్టులు.

హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని.

జీ న్యూస్ హుజురాబాద్ :

ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు కాయిత రాములు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ…
నిత్యం ప్రజా సమస్యలను విలువలు గుర్తించేందుకు జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని నిస్వార్ధంగా పనిచేస్తుంటారని ఆమె అన్నారు. ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించి సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఏకైక వృత్తి జర్నలిజమే అని పేర్కొన్నారు. సమస్యలను వెలికి తెచ్చే ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు ఉన్నారని అన్నారు. అనంతరం విలేకరులు మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ రాజ పల్లి సర్పంచ్ గా ఎన్నికైన కటుకూరి మల్లారెడ్డి, గత నాలుగు సార్లు కౌన్సిలర్ గా గెలుపొందిన కేసిరెడ్డి లావణ్య-నరసింహారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి కౌన్సిలర్ గా గెలుపొందిన గోస్కుల రాజ్ కుమార్, చేల్పూర్ వార్డు సభ్యునిగా ఎన్నికైన వేల్పుల సునీల్ కుమార్, ను విలేకరులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కామని రవీందర్, సీనియర్ జర్నలిస్టులు తిరునగరి ఆంజనేయస్వామి, నంబి భరణి కుమార్, చిలుక మరి సత్యరాజ్, కేదాసి శ్రీధర్, పిల్లల సతీష్, మాచర్ల రాజు, సమ్మెట సతీష్, పబ్బ తిరుపతి, టేకుల సాగర్, గోపగాని మహేష్, కేషబోయిన స్వామి, ఎడ్ల కుమార్, ఫహిం, నిమ్మటూరి సాయికృష్ణ,ముస్కె శ్రీనివాస్ , పోతరాజు సంపత్, నాగవెళ్లి రాజు, భారత రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article