మాయ మాటలు నమ్మి మోసపోవద్దు..

Must read

మాయ మాటలు నమ్మి మోసపోవద్దు..

-కనకాపూర్ సర్పంచ్ అభ్యర్థి గిర్మాయి చిన్న దేవన్న..

జీ న్యూస్ లోకేశ్వరం

మాయమాటలు చెప్పే నాయకులను కాకుండా మీకు నచ్చిన నాయకుని ఎంచుకోవాలని.మాయ మాటలు చెప్పే నాయకుల అబద్ధపు మాటలు నమ్మవద్దని కనకాపూర్ సర్పంచ్ అభ్యర్థి గిర్మాయి చిన్న దేవన్న అన్నారు. లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గిర్మాయి చిన్న దేవన్న  ఇంటింటి ప్రచారం   బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  రాబోయే ఎన్నికల్లో సర్పంచిగా గెలిపిస్తే అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  కనకాపూర్ గ్రామానికి చెందిన వార్డుల   అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.  అలాగే గత రెండు సంవత్సరాల నుండి గ్రామంలో పంట పొలాలకు వెళ్లే రహదారుల మరమ్మత్తులు. రోడ్డుకు ఇరువైపుల ముళ్ల కంపలు తొలగించడం వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.  తనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులతో సంబంధాలు ఉన్నాయని వారి సహకారంతో డెవలపింగ్ ఫండ్స్ తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామాన్ని ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశారు.  జరగబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.

More articles

Latest article