కాంగ్రెస్ ,బిఆర్ఎస్ లకు ఓటు వేస్తే గ్రామ అభివృద్ధిని వ్యతిరేకించినట్టే.

Must read

కాంగ్రెస్ ,బిఆర్ఎస్ లకు ఓటు వేస్తే గ్రామ అభివృద్ధిని వ్యతిరేకించినట్టే.

గ్రామల  అభివృద్ధి పట్ల ఆ పార్టీలకు చిత్తశుద్ధి లేదు

గ్రామాల అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యం.

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి .

జీ న్యూస్, హుజురాబాద్:

 

గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని గ్రామ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని , ఆ రెండు పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తే గ్రామ అభివృద్ధిని వ్యతిరేకించినట్లేనని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి హుజురాబాద్ మండల అధ్యక్షులు రాముల కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు , సిర్సపల్లి గ్రామ వాస్తవ్యులు తూముల వెంకట్ రావు మంగళవారం రోజు కమలం గూటికి చేరారు. వెంకట్రావు చేరిక కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రావుకు కాషాయ కండువా కప్పి , పార్టీలోకి ఆహ్వానించి గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం దండగన్నారు. ఆ పార్టీ ర అధికారంలో ఉన్నప్పుడే గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు లేకుండా గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుందన్నారు. బిఆర్ఎస్ కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కోసం ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ చేయిస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ పార్టీ మునిగిపోయే నావ లాంటిదన్నారు . ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అడ్డగోలు హామీలిచ్చి ప్రజలందరినీ దారుణంగా మోసం చేసిందన్నారు. ప్రధానంగా వంద రోజుల్లో ఆరూ గ్యారంటీలని , ఏ ఒక్క గ్యారెంటీను కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. రెండేళ్లుగా గ్రామపంచాయతీ లకు ఎన్నికలు నిర్వహించకుండా , గ్రామాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా నేడు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లకు వెళ్ళింది తప్ప, గ్రామాల మీద ప్రేమతో కాదనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న మోసానికి జరగబోయే ఎన్నికల్లో గ్రామీణ ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బిజెపి లో చేరిన తూముల వెంకట్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి పార్టీ చేస్తున్న ప్రజా సంక్షేమం , అభివృద్ది తనను పార్టీ వైపు ఆకర్షితుడిని చేశాయని, అందుకే పార్టీలో జాయిన్ కావడం జరిగిందన్నారు.సిర్సపల్లి గ్రామంలో పార్టీ బలోపేతం కోసం పాటుపడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాముల కుమార్, మండల ప్రధాన కార్యదర్శి పారిపెల్లి కొండాల్ రెడ్డి, ఉపాద్యక్షులు ఇనకొండ తిరుపతి రెడ్డి, బీజేవైయం రాష్ట్ర నాయకులు సింగిరాల రామరాజు, సిర్సపల్లి బూత్ అద్యక్షులు ఎడవెల్లి మల్లా రెడ్డిపంచాయతీ ఎలక్షన్ మండల ఇంచార్జీ అల్లి శివ చంద్ర గిరి, మండల నాయకులు రావుల పున్నంచందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article