వేదిక్ మ్యాథ్స్ పోటీలకు శిశుమందిర్ విద్యార్థిని ఎంపిక
జీ న్యూస్ భీమ్గల్
పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని యెన్ను శ్రీకరి రాష్ట్రస్థాయి వేదిక్ మ్యాథ్స్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఆర్మూర్లో ‘విశ్వం ఎడ్యుటెక్’ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో శ్రీకరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు వారు తెలిపారు. భీమ్గల్ మండలంకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు యొన్ను శ్రీధర్ కుమార్తె శ్రీకరి వేగంగా గణిత సమస్యలను సాధించి న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందిందన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి పాఠశాలకు, భీమ్గల్ ప్రాంతానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన శ్రీకరిని పాఠశాల ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి, అకడమిక్ ఇన్ఛార్జి పి.సాయిచరణ్ లు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని ఈ స్థాయికి చేరడంలో కృషి చేసిన వేదిక్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు సీహెచ్ కార్తీక్, ఎన్ రాకేష్, ఆర్ రవికుమార్, డి స్రవంతిలను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
వేదిక్ మ్యాథ్స్ పోటీలకు శిశుమందిర్ విద్యార్థిని ఎంపిక
