బాధిత కుటుంబానికి వారాహి ఫౌండేషన్ బియ్యం వితరణ.
జీ న్యూస్ హుజురాబాద్
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో అందేశ రమేష్ – భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు అభిరామ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ గత 3 రోజుల క్రితం చనిపోయాడు. ఆదివారం బాదితుని కుటుంబాన్ని వారాహి ఫౌండేషన్ డైరెక్టర్ చిలుక మారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్, డైరెక్టర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన అందేశ రమేష్ – భాగ్యలక్ష్మిలకు ప్రభుత్వం ఆదుకోవాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు వారికి అండగా నిలిచి ఆర్థికంగా సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారాహి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కుడికాల భాస్కర్, డైరెక్టర్లు చిలుకమారి శ్రీనివాస్, లక్ష్మణరావు పటేల్, ఇప్పకాయల సాగర్, మమునూరి ప్రవీణ్, సమ్మయ్య, కొత్తూరి జీవన్, మాడుగుల సురేష్, సంఘాల రాజు, మైస కొమురయ్యా, ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
