ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం….

Must read

ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం….

జీ న్యూస్ హుజురాబాద్:

ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేస్తున్న ప్రతి కార్మికునికి,ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం హుజూరాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2026 కు సంబంధించిన నూతన డైరీని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తాను కట్టుబడి ఉన్నానని,దాంతో పాటు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికి అందేలా తాను చూసుకుంటానని ఆ బాధ్యత నాది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article