టీచర్లను వీధి కుక్కలను లెక్క పెట్ట మన్న విద్యాశాఖ..??
ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి
–అచ్చ సుదర్శన్ పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు
జీ న్యూస్ నడికుడ
దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్థల చుట్టూ ఉన్న వీధి కుక్కల లెక్కింపు కోసం నోడల్ ఆఫీసర్లు గా ఉపాధ్యాయులను నియమిస్తూ ఢిల్లీ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని వస్తున్న వార్తల పట్ల పీఆర్టీయూ మండల శాఖ అద్యక్షుడు సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. . ప్రభుత్వ ఆదేశాల మేరకు నార్త్ వెస్ట్ – ఎ జోన్లో ని వివిధ స్కూల్ల నుంచి 118 ఉపాధ్యాయులను నోడల్ అధికారులుగా నియమిస్తూ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. వీధి కుక్కల లెక్కింపునకు ఉపాధ్యాయులను ఉపయోగించాలని విద్యాశాఖ డైరెక్టర్ అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు డిసెంబర్ 5 న సర్కిల్ జారీ చేశారని, ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత గా పరిగణించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. టీచర్ల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ విద్యా విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ సమాజంలో టీచర్లు ఎంతోమందిని మేధావులు తయారు చేసే టీచర్లను వీధి కుక్కల లెక్కింపు కు ఉపయోగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకవైపు విద్యా వ్యవస్థలో వెనుక బడుతూ ఉంటే కుక్కలను లెక్క పెట్టమనడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు వీధి కుక్కలను లెక్క పెట్టినట్లయితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించడం తమ వృత్తి గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో కరోనా సమయంలో బార్ షాపు ల దగ్గర ఉపాధ్యాయులను లైన్లో నిలబెట్టడం కోసం ఉపయోగించారని గుర్తు చేశారు. ఇలాంటి చర్యల వలన ఉపాధ్యాయుల మనోధైర్యం దెబ్బతింటుందని, ఇలాంటి పనులను జంతు సంరక్షణ అటవీశాఖ విభాగాలకు అప్ప చెప్పాలన్నారు. వీధి కుక్కలను లెక్క పెట్ట మనడం కాకుల లెక్క బార్బర్ బీర్బల్ కథ లాగా ఉందని ఎద్దేవా చేశారు.

