సైకత శిల్పాల ప్రదర్శన అద్భుతం
జీ న్యూస్ ఆర్మూర్
సైకత శిల్పాల దశావతారాల ప్రదర్శన అద్బుతంగా ఉందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రోద్దుటూరి వినయ్‌కుమార్ రెడ్డి అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మెట్టమొదటి సారిగా విష్ణువు మూర్తి దశావతారాలను ఇసుక శిల్పాలు గా ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ లేని విదంగా ఇసుకతో దశావతారాలను మలచిన తీరు గొప్పగా ఉందన్నారు. పట్టణవాసులు అధిక సంఖ్యలో వీటిని తిలకించడానికి తరలి వస్తున్నారు. పట్టంణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చి వాటి గొప్పతనాన్ని ఉపాద్యాయులు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్, ఆర్మూర్ మాజి మునిసిపల్ వైస్ షైక్ మున్ను భాయ్, చైర్మన్ లింగ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, నాయకులు బాల్ రెడ్డి, జాంబీ హనుమాన్ ఆలయ మాజి అధ్యక్షులు గోర్థ దేవేందర్, కౌన్సిలర్ లు అథిక్ భాయ్, ఫయాజ్ భాయ్, అజ్జు భాయ్, చిట్టి రెడ్డి, రాజు భాయ్, భుపెందర్రు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

