రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత
జీ న్యూస్ వేములవాడ
రోడ్డు భద్రత ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ప్రతి ప్రయాణం సురక్షితంగా జరిగేలా చూసుకోవాలని వేములవాడ రూరల్ ఎస్ఐ వెంకట్రాజం అన్నారు. బుదవారం వినూత్న రీతిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత పాటించే వారికి గులాబీ పువ్వులు ఇస్తూ వారిని అభినందించినలు తెలియజేశారు. జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమం “Arrive Alive” అనే థీమ్‌తో రోడ్డు భద్రత మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ సందర్బంగా ఎస్ఐ వెంకట్రాజం మాట్లాడుతూ ప్రతి వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరాలనే సందేశాన్ని ఈ థీమ్ స్పష్టంగా తెలియజేస్తుంది అని తెలిపారు. వాహనదారులు అతివేగంగా వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మీకు మరియు ఎదుటి వారికి ప్రమాదం అన్నారు. మోటార్ సైకిల్ లు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించకపోవటం, కార్ లు నడిపే వారు సీట్‌బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ నియమాలు విధిగా అందరూ పాటించాలి అని సూచించారు. భద్రతతో కూడిన ప్రయాణం, నియమ నిబందనలు పాటించటం ద్వార వారి కుటుంభమే కాకుండా మిగతా వారి కుటుంభ సభ్యుతుల కూడా ఆనందంగా ఉంటారన్నారు.

