రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి….

Must read

రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి

రంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు

జీ న్యూస్ నర్సంపేట

వరంగల్ జిల్లా వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో… క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు అధికారులకు సూచించారు.

జిల్లా అధికారులతో తక్కళ్లపెల్లి రవీందర్ రావు మాట్లాడుతూ..తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల…రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్,రెవిన్యూ,ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లోని అన్ని చెరువులు నిండి ఉన్నందున,ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా పునరావస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తాసిల్దారులు,ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

చెరువులు నిండి వంకలన్నీ ఉధృతంగా ప్రవహించనున్న నేపథ్యంలో తాసిల్దార్లు,ఎంపీడీవోలు తమ మండల పరిధిలోని లు గ్రామాలు జల మాయమయ్యే ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉద్ధృతితో రోడ్లు తెగిపోయిన ఉదృతంగా ప్రవహించిన ఆయా ప్రాంతాల్లో ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని బ్యారికేడ్ లు, ఇతర సూచికలు  ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుందని,కావున రోడ్డు రవాణా విద్యుత్ సరఫరా లో అంతారం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, విద్యుత్,రోడ్ల భవనాల శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.నీటిపారుదల శాఖ అధికారులు చెరువులు కుంటలు లోని నీటిమట్టాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు.

More articles

Latest article