తట్టేడు మట్టి తీయాలేని కౌశిక్​ రెడ్డి…. అభివృద్ధి చేస్తాడా..??

Must read

ఎమ్మేల్యేగా కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గానికి తట్టెడు మట్టైనా తీసిండా?

సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి,అభివృద్ధికి నాంది పలకండి…ప్రణవ్

– డప్పు చప్పుళ్ళతో,మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు..

– సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రణవ్..

జీ న్యూస్ హుజురాబాద్:

రెండేళ్లలో చస్తా అని,సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఎమ్మేల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి తట్టెడు మట్టైనా హుజూరాబాద్ లో తీసిండా అని  కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రశ్నించారు?..ఎమ్మేల్యేనే ఏం చేయడం లేదు కానీ అతను బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ఉపయోగం ఉంటుందా ప్రజలు ఆలోచించాలన్నారు.  మంగళవారం రోజున కమలాపూర్ మండల పరిధిలోని భీంపల్లి, శనిగరం, మాదన్నపేట, లక్ష్మీపూర్, నేరేళ్ల, గూనిపర్తి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.   గ్రామాల్లో ప్రజలు డప్పు చప్పుళ్ళతో, మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ఎన్నికలు రాగానే  ఆగం కావొద్దని, పని చేసే వారు ఎవరు, ప్రజల కోసం కష్టపడే వారు ఎవరు ఆలోచించాలన్నారు.  గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఓడినా, గెలిచినా ప్రజా సమస్యల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడుతున్నామని, రాబోయే 3 ఏళ్లలో ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మరింత ఉత్సాహంతో రెట్టింపు పనిచేస్తామన్నారు.  పనిచేసే వారికి పట్టం కట్టడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం మరింత లబ్ధి చేకూరుతుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.

ఈ ప్రాంతంలో ఒక్కసారి ఓడిపోగానే పక్క ప్రాంతానికి వెళ్ళిన నాయకులు రెండేళ్లలో ఏం అభివృద్ధికి సహకరించారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 9 రోజుల్లో 9వేల కోట్ల రైతు భరోసా నిధులు అందించామన్నారు. రుణమాఫీ, ఆరోగ్య శ్రీ 10లక్షలకు పెంపులాంటి పథకాలు జనాలకు అందజేశామని ప్రజలకు ఏవీ అందుతున్నాయో అవే చెప్పామన్నారు. కమలాపూర్ మండలంలోని ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల, గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ..

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

More articles

Latest article