పెన్షనర్లకు హెల్త్ కార్డుల సాదన కోసం పోరాటం

Must read

పెన్షనర్ల సమస్యలపై, హెల్త్ కార్డుల సాధనకు పోరాటం.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి

జీ న్యూస్ హుజురాబాద్

పెన్షనర్లకు హెల్త్ కార్డుల సాదన కోసం ప్రభుత్వంపై పోరాటం చేసి ఒత్తిడి తీసుకొచ్చి సాధిస్తామని వరంగల్ – ఖమ్మం – నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో పెన్షనర్స్ డే నిర్వహించారు. తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు ఎండి ఉస్మాన్ పాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు  స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసానని, తానుకూడా ఒక విశ్రాంత ఉద్యోగినే, పెన్షనర్ నే అని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు పెంచిన తర్వాత 2024 నుండి చాలా మంది ఉద్యోగ విరమణ చేస్తున్నారన్నారు.  కానీ ప్రభుత్వం నుండి వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని, ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారని, మానసిక ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వారందరికీ ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసారు. పెన్షనర్లు ఐక్యతతో, సమన్వయంతో పనిచేసి తమ హక్కులు సాధించుకోవాలని అన్నారు.  పెన్షనర్లకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తామని, ఒత్తిడి తెస్తామని శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేసారు. ఉస్మాన్ పాషా, గంజి జయవర్ధన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ యూనిట్ చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకున్న శ్రీపాల్ రెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందించారు.

92 మంది పెన్షనర్లకు సన్మానం

పెన్షనర్స్ డే సందర్బంగా 92 మంది పెన్షనర్లకు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ లో పెన్షనర్స్ డే లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని, మంచి కార్యక్రమాన్ని నిర్వహించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు ఎండి ఉస్మాన్ పాషా, ప్రధాన కార్యదర్శి గంజి జయవర్ధన్, ఉపాధ్యక్షులు కోయల్కర్ దుర్గాజి, మేడిశెట్టి నర్సయ్య, అసోసియేట్ అధ్యక్షులు వి. లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్, జె రామ్ రెడ్డి, జి రాజయ్య, పి లక్ష్మీనారాయణ, గణపతి రెడ్డి, కాసర్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article