అధికారుల వైఖరికి నిరసనగా అంబేద్కర్ కు వినతిపత్రం

Must read

అధికారుల వైఖరికి నిరసనగా అంబేద్కర్ కు వినతిపత్రం

జీ న్యూస్ హుజురాబాద్:

విద్యాశాఖ అధికారుల తీరుకు నిరసనగా హుజరాబాద్ బస్టాండ్​ చౌరస్థాలోని  అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతి పత్రం అందజేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
హుజూరాబాద్ మండల విద్యాధికారి పై విద్యాశాఖలో పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంలో గల ఆంతర్యం ఏమిటో తెలియడం లేదన్నారు.  హుజరాబాద్ మండలం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు.  హుజరాబాద్ మండల విద్యాధికారి, స్కూల్ అసిస్టెంట్ గణితం బోధించవలసిన గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు కుమ్మక్కై కార్యాలయ విధుల పేరిట బోధ నేతల పనులు చేయడం కచ్చితంగా విద్యార్థులకు అన్యాయం చేసినట్లే  అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు  ప్రజావాణిలో, విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, కమిషనర్ సంచాలకులు, విద్యాశాఖ డైరెక్టర్ గార్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.  విద్యార్థులకు పాఠాలు బోధించి జీతాలు పొందవలసిన ఉపాధ్యాయుడు ఎంఈఓ కార్యాలయంలో విధుల పేరిట టైంపాస్ చేస్తున్నాడన్నారు.  గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి లక్షల్లో జీతాలు పొందాడని పాఠాలు చెప్పకున్నా జీతాలు పొందడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.  తక్షణమే ప్రభుత్వం  దృష్టిసారించి హుజరాబాద్ ఎంఈఓ,  గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, దశల వారీగా ఉద్యమం ఉదృతం చేస్తానని, వీరి అధికార దుర్వినియోగంపై పోస్టర్ ఆవిష్కరణ చేస్తానని తెలిపారు.

More articles

Latest article