దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలే
జీ న్యూస్ ఎడ్యుకేషన్ ప్రతినిది డిసెంబర్20

దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలేనని కిట్స్ కళాశాలల కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆరు రోజుల అటల్ ఎఫ్డిపి కార్యక్రమ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ కే.శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులో ఉండాలని, ప్రతి పౌరునికి చదువుకునే అవకాశం కల్పించాలని కిట్స్ కళాశాలను ప్రారంభించామన్నారు. కళాశాలలో ఉన్న వసతులను విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఉపయోగించుకొని సామాజిక సమస్యలు పరిష్కరించే పరిశోధనలు చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో దేశములోని వివిధ ప్రాంతాల నుండి 71 మంది పీజీ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు హాజరయ్యారన్నారు. ఇంతకుముందు రెండు అటల్ ఎఫ్డిపీలు నిర్వహించామని, కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయని, నిష్ణాతులైన అధ్యాపకుల, శాస్త్రవేత్తలచే శిక్షణ ఇప్పించామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో నిర్వహించే అటల్ కార్యాశాలలో ఇంతకుముందు రెండుసార్లు నిర్వహించామని అన్నారు. నిర్వహిస్తున్న అటల్ కార్యశాల మూడవది అని వివరించారు. శిక్షణ సమన్వయకర్త శ్యాంసుందర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న అధునాతన పరిశోధనలు చర్చించామన్నారు. కార్యక్రమ సహసమన్వయకర్త అధ్యాపకరాలు ఎన్ లలిత వందన సమర్పణ చేశారు. అనంతరం కళాశాల సెక్రెటరీ సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్ , విభాగాధిపతి బి. రమేష్, సమన్వయకర్త శ్యాంసుందర్ ను, సహ సమన్వయకర్త లలిత లను జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించారు.

ఆవిష్కరణలకు భాష అడ్డుకారాదు
ప్రపంచంలో జరుగుతున్న ఎక్కువ ఆవిష్కరణలు గ్రామీణ ప్రాంతం నుంచే జరుగుతున్నాయని కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ రెడ్డి అన్నారు. సింగాపూర్ కిట్స్ కళాశాలలో అటల్ కార్యశాల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దాదాపు ఎక్కువ ఆవిష్కరణలు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నాయన్నారు. ఆవిష్కరణలకు భాష అడ్డు కాదని, ఒక వ్యక్తి యొక్క జీవన అవసరాలు, పరిశ్రమల యొక్క అవసరాల దృష్ట్యా ఆవిష్కరణలు వస్తున్నాయని వివరించారు. చదవటం, రాయటం రానివారు, ఎటువంటి విద్యార్హత లేని వారు కూడా ఆవిష్కరణలకు తోడ్పడుతున్నారన్నారు. విద్యార్థి నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో తనకు అవసర ఉన్నప్పుడు చదవడం వదిలిపెట్టి, మళ్లీ అతనికి వీలున్నప్పుడు వచ్చి కళాశాలలో చేరి డిగ్రీని పూర్తి చేసే అవకాశాన్ని ఈ నూతన విద్యా విధానంలో ప్రవేశపెట్టారన్నారు. విద్యార్థి ఒకవేళ ఒక సంవత్సరము విద్య పూర్తి చేస్తే డిప్లమా సర్టిఫికెట్ పొందుతారని వివరించారు. రెండవ, మూడో సంవత్సరాల తర్వాత కళాశాలను వదిలిపెడితే అడ్వాన్స్ డిప్లమా సర్టిఫికెట్ పొందుతారన్నారు. ఈ మార్పులు రాబోయే సంవత్సరాల్లో అమల్లోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆఫ్లైన్, ఆన్లైన్ అనగా హైబ్రిడ్ మోడ్ విద్యా బోధన విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. నూతన విద్యా విధానములో ఏ.బి.సీ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఉంటుందని, బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు విద్యార్థులు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ లో తాము చదివిన విద్య వివరాలను పొందుపరిచి, వాళ్ల వల్ల విద్యా వివరాలను క్రెడిట్ల రూపంలో దాచుకోవచ్చన్నారు. ఉద్యోగం ఇచ్చే సంస్థలు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ లో వివరాలు చూసి ఉద్యోగాలు ఇస్తాయని, మళ్లీ ప్రత్యేకంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ లు ఉండవన్నారు. కళాశాల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి. రమేష్ మాట్లాడుతూ ఈ కార్యశాలకు విషయ పరిజ్ఞానంలో నిష్ణాతులైన వారిచే శిక్షణ ఇప్పిచ్చామని వివరించారు.
