అవకాశం ఇవ్వండి అభివృద్ది చేసి చూపిస్తా..
ఎన్నం లక్ష్మీ ప్రకాష్
49వ డివిజన్లో ఎగరనున్న బీజేపి జెండా
జీ న్యూస్ కరీంనగర్
ఒక్కసారి అవకాశం ఇవ్వండి..49వ డివిజన్‌ను అభివృద్ది చేసి చూపిస్తానని బీజేపి పార్టీ 49వ డివిజన్ అభ్యర్థి ఎన్నం లక్ష్మీ ప్రకాష్ ఓటర్లను కోరారు. గత పాలకులు ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఎక్కడి సమస్యలను అక్కడే వదిలేశారన్నారు. డివిజన్లో అభివృద్ది చేసి కార్పోరేషన్‌లోనే ఆదర్శంగా ఉండేలా పాటుపడతానన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తానన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమర్ అండతో కేంద్రం నుండి నిధులు తీసుకు వచ్చి అభివృద్ది చేస్తానన్నారు. వారంలో ఒకరోజు డివిజన్లో ప్రజావేధిక ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 49వ డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతూ లక్ష్మీ ప్రకాష్‌ను గెలిపిస్తామని హామీ ఇస్తుండటంతో 49వ డివిజన్లో బీజేపి జెండా ఎగరటం ఖాయం కనిపిస్తుందని తెలస్తుంది….

