జోగి రమేషే నకిలీ మద్యం సూత్రధారి

Must read

మాజీమంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోని నకిలీ మద్యం తయారీ
-సంచలన విషయాలు బయటపెట్టిన నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు

జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అమరావతి:

నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు బయట పెట్టాడు .వైకాపా పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని పేర్కొన్నాడు .కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేసినట్లు వివరించాడు. ఏప్రిల్ లో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీమద్యం తయారు చేయాలన్నారు. చంద్రబాబుకు చెడ్డపేరు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. నకిలీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్న జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లెలో తయారీ ప్రారంభించాం. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లొచ్చని జోగి రమేష్ చెప్పారు అని జనార్దన్ రావు తెలిపారు.

More articles

Latest article