తెలంగాణ జాగృతిలోకి ఉద్యమకారులు
జీ న్యూస్ కరీంనగర్
తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ రమేష్ మంగళవారం జాగృతిలో చేరారు. జాగృతి జిల్లా కార్యలయం జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్వా రమేష్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరిని రాష్ట్ర ఆవిర్భావం తరువాత అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని, పది సంవత్సరాల పాలనలో చేయవలసిన న్యాయం చెయ్యలేదన్నారు. కవితక్క జనం బాట కార్యక్రమం మొదలు పెట్టిన తోలిరోజే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు క్షమాపణలు చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వారి కుటుంబానికి ఇరవైఐదు వేల పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. అంతేకాకుండా ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పరన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి గౌరవ భృతి అందచేస్తామని ఎన్నికల సందర్భంగా ఊరు తిరిగి చెప్పి ఇప్పుడు అయ వర్గాలకు మొండి చెయ్యి చూపారన్నారు. కవితక్క నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాడుతుందన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, చంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
