భారీ సంఖ్యలో జాగృతిలో యువకుల చేరిక
జీ న్యూస్ కరీంనగర్
సైదాపూర్ మండల ఇంచార్జ్ జిల్లా యువజన విభాగం నాయకుడు హుస్నాబాద్ రాజకుమార్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కార్యలయంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువకులు జాగృతిలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ హాజరై యువకులకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎ ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని రాజకీయంగా ఎదగాలని వారు అన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా స్పందించేది కవితక్కనే అన్నారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి, ఇప్పుడు విద్యార్థుల సమస్యల మీద, నిరుద్యోగుల ఇబ్బందులమీద వారి పక్షాన పోరాటం చేస్తున్నది కూడ కవితక్క మాత్రమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువకుల ఓట్లు కోసం అనేక హామీలు ఇచ్చింది కానీ ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచిన వాటి గురించి పట్టించుకోవటం లేదన్నారు. ముఖ్యమంత్రికి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి మరిచారని, నిరుద్యోగ భృతి ఏమైంది అని నిరుద్యోగులు అడుగుతున్నారని ప్రశ్నించారు. యూత్ కమీషన్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఎప్పుడూ ఇస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థిని, విద్యార్థులకు పోటీ పరీక్షలకు గాను తెలంగాణ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని ఇంతవరకు వాటి ఊసే లేదని, ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి నేటికీ గతిలేదన్నారు. విద్యార్థినులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు లేక కాలేజిలు ముసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణను ఎడ్యుకేషనల్ హబ్ గా చేస్తామని చెప్పి, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆయన సోదరుల కోసం రియల్ ఎస్టేట్ హబ్ గా మార్చాడన్నారు. విదేశీ విద్యకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు అందించే ఆర్ధిక సహాయం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి గుర్తుకు రావడం లేదన్నారు. ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ప్రతి జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చి మరిచారని విమర్శించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలకు వెళ్తుందని, ప్రతి చోట విద్యార్థులే ముందుకు వచ్చి కవితక్క కు తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నారన్నారు. కచ్చితంగా కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతి విద్యార్థుల సమస్యల మీద రానున్న కాలంలో పోరాటం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా సీనియర్ నాయకులు బుడిగె పర్శరం గౌడ్, రంగరవేణి లక్ష్మణ్, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, గాలిపెల్లి రత్నాకర్ చారి తదితరులు పాల్గొన్నారు.
