జాగృతిలో చేరిన బీజేపి నాయకులు

Must read

జాగృతిలో చేరిన బీజేపి నాయకులు

జీ న్యూస్​ కరీంనగర్​

బీజేపి పార్టీ నాయకుల ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు. జాగృతి జిల్లా కార్యలయంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో  జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శ్రీరాముల రమేష్ ఆధ్వర్యంలో గంగాధర మండలానికి చెందిన బిజెపి యువమోర్చ నాయకులు అలిశెట్టి అజయ్, గాజుల శివకృష్ణ జాగృతి చేరినట్లు జిల్లా అద్యక్షుడు హరిప్రసాద్​ వెల్లడించారు.  జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి వారిని జాగృతిలోకి ఆహ్వానించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ కవితక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న కృషిని చూసిన యువకులు పెద్దఎత్తున జాగృతిలోకి చేరుతున్నారన్నారు. కవితక్క ఏ సమస్యను లేవనెత్తిన దానికి ప్రజలనుండి సంపూర్ణ మద్దతు వస్తుందని కవితక్క ప్రస్తావన చేసిన అంశాల మీదనే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు.   ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ప్రతిపక్షం,పలకపక్షం ఒకటైన సంగతి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కృష్ణ జలాల మీద అసెంబ్లీలో జరుగుతున్న చర్చలలో ప్రధాన ప్రతిపక్షం పాలుపంచు కోకాపోవడంతో, ఆ పార్టీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కమీషన్స్ కోసమే అరాట పడుతున్నట్లు ప్రజలు మాట్లాడు కుంటున్నారన్నారు.  కవితక్క జనం బాటలో భాగంగా గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు రెండు రోజుల చొప్పున తిరుగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.  కార్యక్రమంలో జిల్లా మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అక్కం శివరాణి, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బసవేణి రాజేందర్, రాజ్ కుమార్, బండ రమేష్, గుంజపడుగు పవన్ కుమార్, జంగా అపర్ణ సాగర్, పోతన, రూప తదితరులు పాల్గొన్నారు

 

More articles

Latest article