శాస్త్రీయ దృక్పథంతో బోధించాలి
విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలు
ఇస్రో శాస్త్రవేత్త అనుమాండ్ల సుకృత
జీ న్యూస్ నడికుడ

విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలని, వారికి శాస్త్రీయ దృక్పథంతో బోధించాలని ఇస్రో సైంటిస్ట్ అనుమాండ్ల సుకృత అన్నారు. నడి కూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ గారి ఆహ్వానం మేరకు ఇస్రో సైంటిస్ట్ అనుమాండ్ల సుకృత చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందని ఇస్రో సైంటిస్టులను పాఠశాల సందర్శనకు ఆహ్వానించామన్నారు. అనంతరం ఇస్రో సైంటిస్ట్ అనుమాండ్ల సుకృత మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లలకు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథంతో విద్యాబోధన చేయాలని అప్పుడే విద్యార్థులలో కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలవుతాయని అన్నారు విద్యార్థులు ఎప్పుడు కొత్త ఆలోచనలతో ఉపాధ్యాయులను ప్రశ్నలు అడగాలని తరగతి గదిలో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రగతి కోసం వారికి ప్రయోగాత్మక, పరిశీలనాత్మక విద్యను అందించడానికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందనీయులని కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులలో చైతన్యం నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం అభినందనీయమని, విద్యార్థుల చైతన్యం విజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆలోచన నన్ను ఆకట్టుకుందని, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలన్నారు. సుకృత విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించిన విధం విద్యార్థుల్లో ఉత్సాహం నింపిందని, ఈ సందర్భంగా సైంటిస్ట్ సుకృత రాకెట్ మంచి సెట్ లైట్స్ పనితీరును ఇస్రో యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించే అందుకుగాను టెలిస్కోప్ బహుమతిగా ఇచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణంలో పర్యావరణాన్ని కాపాడాలంటూ మొక్కను నాటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఇస్రో సైంటిస్ట్ అనుమాండ్ల సుకృతను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఉపాధ్యాయులు లకావత్ దేవా, కంచ రాజు కుమార్, పుల్లూరి రామకృష్ణ ఆయాలు అరుణ, రమ, సుశీల మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
