ఎన్నికల ఉన్నందున ఏపీపీ రాత పరీక్షను వాయిదా వేయాలి

Must read

ఎన్నికల ఉన్నందున ఏపీపీ రాత పరీక్షను వాయిదా వేయాలి

తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు 

జీ న్యూస్ హుజురాబాద్

పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష వున్నందున ఆ పరీక్ష ను వాయిదా వేయాలని టీజేఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.   వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు అయితే ఓటుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.  ఈనెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని,  అదే రోజున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తోందన్నారు.  ఏపీపీ రాత పరీక్షా కేంద్రాలను కేవలం హైదరాబాద్ లోనే నిర్వహిస్తుండటంతో  గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతారన్నారు.  ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన (ఆర్టికల్ 326) రాజ్యాంగపు హక్కు అంతే కాకుండా ప్రాథమిక హక్కు అయినటువంటి భావ ప్రకటనా స్వేచ్ఛలో( 19(1)(a)) భాగంగా అంతర్లీనంగా ఇమిడి వుందని ఆయన వివరించారు.  న్యాయం కోసం పోరాడే న్యాయవాదుల సమస్య పట్ల వెంటనే స్పందించి  ఏపిపి రాత పరీక్షను వాయిదా వేసి న్యాయవాదులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు.

 

More articles

Latest article