చర్లపల్లి స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

Must read

చర్లపల్లి స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

ఎదిగే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి-ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ 

జీ న్యూస్ నడికుడ

ఆరోగ్యవంతమైన యువతే దేశ భవిష్యత్తు అని అందుకే ఎదిగే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్ అన్నారు. నడి కుడ మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ అనుదేశానుసారం తల్లిదండ్రులు,  ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో భాగంగా  ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాలైన వంటలను, తిను బండారాలను విద్యార్థులు, వారి పేరెంట్స్ తీసుకు వచ్చారు.  కోడికూర, చికెన్ బిర్యాని, తెలంగాణ వంటకాలు, పులిహోర,  గులాబ్ జామ్, సేమ్యా, పుల్కా, సర్వపిండి, నువ్వుల ముద్దలు, పల్లి పట్టీలు, పేలాల ముద్దలు, రాఫుడ్, వివిధ రకాలైనటువంటి పండ్లు తీసుకువచ్చి వారి పిల్లలకు తినిపించారు. ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఎదిగే పిల్లలకు అన్ని రకాల పౌష్టికాహారాన్ని అందించినప్పుడే వారు ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. పౌష్టికాహారంతో పిల్లలు అన్ని రంగాలలో రాణించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా, కంచరాజు కుమార్, పుల్లూరి రామకృష్ణ , అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడి టీచర్ బీముడి లక్ష్మి, విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.

More articles

Latest article