నూతన సర్పంచ్ లను సన్మానించిన బోస్లే నారాయణరావు పటేల్
జీ న్యూస్ బైంసా
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్లను ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మూధోల్ శాసనసభ్యుడు బోస్లే నారాయణరావు పటేల్ వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుభీర్ మండలం లోని చాతా గ్రామ నూతన సర్పంచ్ దేవేందర్, కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఆయన అభినందించారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన పదవిని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసి వారి మన్ననలను పోందాలన్నారు. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుశంకర్ చంద్రే, కుభీర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చాతా గ్రామ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
