సీఎం పదవిపై నాకు ఆసక్తి లేదు

Must read

సీఎం పదవిపై నాకు ఆసక్తి లేదు
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే సంచలన వ్యాఖ్యలు

జీ న్యూస్  నెట్​వర్క్

కర్ణాటక ప్రభుత్వంలో కొన్నేళ్లుగా వస్తున్న సీఎం మార్పు ఊహగానాలకు డిప్యూటీ సీఎం డీకే తెరదించారు. నాకు సీఎం పదవిపై ఆసక్తి లేదని నా తలరాత ఏంటో నాకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో మంత్రులను కొత్తవారిని ఎంపిక చేస్తారని అలాగే కొత్త సీఎం కూడా వస్తున్నారని కర్ణాటకలోని మీడియా ఛానల్లో వార్తలు వచ్చాయి. దీనికి సమాధానంగా డిప్యూటీ సీఎం డీకే స్పందించారు. కొన్ని మీడియా ఛానల్లు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు .అన్నిటికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.

More articles

Latest article