
నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తు కు పునాదులు
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి
నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులని సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కందుకూరి శంకర్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో డాక్టర్ శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు. అయన మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాల మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను సమాజానికి ఉపయోగపడే విధంగా చూడాలని, ఇంజనీరింగ్ విద్యార్థులు సమాజానికి అవసరమైన ప్రయోగాలు చేయాలన్నారు.
విద్యార్థి యొక్క క్రమశిక్షణ, నిజాయితి అతని పరిపూర్ణ వ్యక్తిత్వానికి పునాది అని శంకర్ అన్నారు. విద్యార్థులు న్యాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలన్నారు సమాజము పట్ల గౌరవభావంతో ఉండాలన్నారు. భారతదేశ అభివృద్ధిలో యువత పాత్ర ముఖ్యమైనదన్నారు. గణతంత్ర వేడుక సందర్భముగా ఎన్సిసి అధికారి డాక్టర్ మేజర్ కె రవీంద్రబాబు పర్యవేక్షణలో ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ శంకర్ ఎన్సిసి క్యాడేట్లకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల రిజిస్టర్ డాక్టర్ వి. రాజేశ్వరరావు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ కే.విజయలక్ష్మి, లైబ్రేరియన్ ఈ.ఈ.రామకృష్ణ, స్టూడెంట్స్ యాక్టివిటీ ఇన్చార్జెస్ డాక్టర్ ఏ కొమురయ్య, గౌరీ పుండలిక్, అధ్యాపకులు డాక్టర్ అశోక్, సుభద్ర, డాక్టర్ రాజేంద్రప్రసాద్, రఘు, ప్రశాంత్, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ బి. రమేష్, డాక్టర్ కె. ప్రవీణ్ కుమార్ రావు, డీన్ అకాడమిక్ అఫైర్స్ డాక్టర్ జి.మల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. జెండా వందనమునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఫిజికల్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించచారు.

