పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం
సర్పంచ్ బండి రేణుక శంకర్
జీ న్యూస్ నడికుడ
నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున చర్లపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అధ్యక్షత వహించగా సర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్ష అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంఖ్య పెరగడానికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అనంతరం సర్పంచ్ బండి రేణుకా శంకర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం సర్పంచ్ బండి రేణుక శంకర్, ఉప సర్పంచ్ మామిడాల శ్రీనివాస్ రెడ్డి వార్డు మెంబర్లు భీముడి విజయ, తూర్పాటి ఐలయ్య, భనువారి తిరుపతమ్మ, పొడిశెట్టి బ్రహ్మం, మీనుగు దేవేందర్ ,శీలం కవిత, పరిషవేణి కుమారస్వామి, పరిష బోయిన స్వరూప, శీలం రాకేష్, గంగారం నాగలక్ష్మి, బొల్లారం ప్రత్యూష లను పాఠశాల ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, అంగన్వాడీ టీచర్స్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా కంచరాజు కుమార్ పుల్లూరి రామకృష్ణ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ నందిపాటి సంధ్య పాల్గొన్నారు.

