దుబ్బ రాజన్న జాతరకు పూర్తి బందోబస్తు
వేములవాడ రూరల్ ఎస్సై వెంకటరాజం
- జీ న్యూస్ వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె గ్రామంలో వెలసిన గ్రామ దేవత శ్రీ దుబ్బ రాజన్న స్వామి జాతరలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వేములవాడ రూరల్ ఎస్సై వెంకట్రాజం తెలిపారు. మాఘ అమావాస్య జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో, గ్రామస్తులు వేములవాడ రూరల్ ఎస్సై వెంకటరాజంకు గురువారం జాతరకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, జాతర కమిటీ సభ్యులు ఎస్సై వెంకటరాజంను జాతర వివరాలను తెలియజేస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం జాతరకు సంబంధించిన పోస్టర్ను ఎస్సై వెంకటరాజం గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటరాజం గారు మాట్లాడుతూ, దుబ్బ రాజన్న జాతరను భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతర నిర్వహణలో నిర్వాహకులు, గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
