వంగవీటి ఆశాకిరన్ రంగాకు సన్మానం

Must read

వంగవీటి ఆశాకిరన్ రంగాకు సన్మానం

జీన్యూస్​ వేములవాడ

స్వర్గీయ వంగవీటి మోహన రంగ కుమార్తె వంగవీటి ఆశాకిరన్ రంగాను బీసీ  సాదికారిత సంఘం ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు పటేల్స్ ఆధ్వర్యంలో వేములవాడలో గత మూడు రోజులనుండీ జరుగుచున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్బంగా బీసీ సాదికారిత గౌరవ అద్యక్షుడు కొండ దేవయ్య, ఉత్తర తెలంగాణ ఇంచార్జి  పొలాస నరేందర్ ఆమెకు పులగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. వంగవీటీ మోహన రంగా చేసిన సేవలను కొనియాడారు. ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం జిల్లా నేతలు పోనిశెట్టి శంకర్, ఇప్పపూల అజయ్, ఇల్లందుల వెంకటేష్, చింతలకొటీ రామస్వామి గౌడ్, కొలథాల తిరుపతి, తుంరాజు, వొడ్డేర జంపయ్యా, కథ్రొజు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article