నూతన సర్పంచ్​లకు సన్మానం

Must read

నూతన సర్పంచ్​లకు సన్మానం

జీ న్యూస్​ హుజురాబాద్​

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన పలువురు సర్పంచ్ లను వాకర్ అసోసియేషన్​ సభ్యులు గురువారం సన్మానించారు. స్థానిక హైస్కూల్​ క్రీడా మైదానంలో వాకర్ అసోసియేషన్​ సభ్యులుగా ఉండి..ఇటీవల జరిగిన ఎన్నికలలో రాజపల్లి ​ గ్రామ సర్పంచ్​గా కట్కూరి మల్లారెడ్డి, రాములపల్లె సర్పంచ్​గా అనుమల్ల రాంరెడ్డి, ఎలబోతారం సర్పంచ్ గా రవీందర్ లు​ విజయం సాదించారు. కాగ వారు హుజూరాబాద్​ వాకర్ అసోసియేషన్​లో అక్టివ్​ మెంబర్లుగా కొనసాగుతున్నారు. ఈ సందర్బంగా వాకర్​ సభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యం కోసం నిరంతరం పాటుపడే వాకర్​ సభ్యులు సర్పంచ్ లుగా గెలవటం ఆనందంగా ఉందన్నారు. వారు గ్రామాలను అభివృద్ది చేస్తూ గ్రామస్థులను ఆరోగ్యంగా ఉండేలా పలు కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్య గ్రామ పంచాయతీలుగా, గ్రీన్​ పంచాయతీలుగా మార్చాలని కోరారు. కార్యక్రమంలో బండ శ్రీనివాస్​, పుల్లూరి ప్రభాకర్​ రావు, వర్దనేని రవీందర్ రావు, ఎంఏ మథిన్​, గొవర్దన్​, తాళ్లపల్లి శ్రీనివాస్​, రాజిరెడ్డి, సారయ్య, కుమార స్వామి, చింత శ్రీనివాస్​, ఎర్రం రాజన్న, కొలిపాక శ్రీనివాస్​, పాక సతీష్​, పల్కల ఈశ్వర్​ రెడ్డి, రత్నం, ప్రభాకర్​, మహేష్​, సాదుల రవీందర్​ రావు, సదానందం, ఉప్పు శ్రీనివాస్​, గొపాల్​ రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article