హుజురాబాద్ సిఐకి డిస్ట్రిబ్యూటర్లు సన్మానం

Must read

హుజురాబాద్ సిఐని సన్మానించిన డిస్ట్రిబ్యూటర్లు

జీ న్యూస్, హుజురాబాద్:

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాం నుండి సేవా పథకం అవార్డును అందుకున్న హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ ను స్థానిక ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు  ఆదివారం ఘనంగా సన్మానించారు. సీఐ శాంతి భద్రతల పరిరక్షణకు నేరాల అదుపునకు ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారని, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రజలను చైతన్యం చేస్తున్నారని ప్రశంసించారు.  రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డును అందుకోవడం హర్షనీయమన్నారు. ప్రజలు పోలీసు అధికారులు, సిబ్బందికి సహకరించాలని తద్వారా మరింత ప్రజల కోసం పనిచేస్తారని వారన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు బొల్లు శ్రీనివాస్, కార్యదర్శి యంసాని శశిధర్, సంపత్ రావు, క్యాస విజయ్ కుమార్, కాచం ప్రభాకర్, నగునూరి సత్యనారాయణ, పెద్ది శివకుమార్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article