కొండగట్టు అంజన్న పునర్జన్మనిచ్చాడు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జీన్యూస్ ప్రత్యేక ప్రతినిధి
నాకు పనర్జన్మనిచ్చిన దేవుడు కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటానని, అభివృద్దికి సహకరిస్తానని ఏపి డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని శనివారం ఉదయం దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా అధికారులు, ఆర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాన్‌ను చూడటానికి వేలాదిగా ఆయన అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఆయన జీప్ టాప్‌పై కూర్చుని అందరికి అభివాదం చేస్తూ ఉల్లాసపరిచారు.


అనంతరం అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూ. 35.19 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో భక్తుల వసతి కోసం 96గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. పవన్ కల్యాణ్ తోపాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తెలంగాణ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న అంటే నాకు చాల ప్రమని, అంజన్న ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడవేసి కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చిందన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఆ అంజన్నే తనను కాపాడారని బలంగా నమ్ముతానన్నారు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. అందుకే తన ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’కి కూడా ఇక్కడే పూజలు చేయించానని గుర్తుచేశారు. కొండగట్టు అభివృద్ధికి నా వంతు సాయం చేస్తానని పవన్ పేర్కోన్నారు.
గతంలో దర్శనానికి వచ్చిన ప్పుడు దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని కోరారు. తిరుమల తిరుప తి దేవస్థానం సభ్యులు, తెలంగాణ నాయకులు అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. అంజన్న ఆశీస్సులతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పవన్ అన్నారు. గిరి ప్రదక్షిణ అంశాన్ని అర్చకులు, దేవాదాయ శాఖ వారు తన దృష్టికి తెచ్చారని, కొండగట్టు గిరి ప్రదక్షిణకు సహాయం చేస్తామని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ కృతజ్ఙతలు తెలిపారు. రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని, ఆంజన్న ఆశీస్సులు ఆయనకు ఉండాలని పవన్ పేర్కొన్నారు. టీటీడీ, తెలంగాణ నేతల సమిష్టి కృషితోనే ధర్మశాల నిర్మాణం విషయంలో ముందడుగు పడిందని అన్నారు. భక్తుల బలమైన సంకల్పంతో ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బృందావనం రిసార్ట్‌లో సర్పంచ్‌లు, జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు.
