ఘనంగా సహస్ర ప్రత్యంగిరా మాత యజ్ఞం

Must read

ఘనంగా సహస్ర ప్రత్యంగిరా మాత యజ్ఞము

జీ న్యూస్ చౌట్​పల్లి

నిజమాబాద్ జిల్లా చౌట్ పల్లి గ్రామంలో గురువారం శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర దేవస్థానంలో శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి హంపి పీఠాధిపతి చేతుల మీదగా విశిష్టమైన సహస్ర ప్రత్యంగిరా మంత్ర యజ్ఞము ఘనంగా జరిగింది.   శ్రీ గాయత్రి ప్రత్యంగిరా సంతోషిమాత అమ్మవార్లకు 108 అష్టోత్తర శత కలశ కుంబాభిషేకము, పంచామృత అభిషేకము సహస్ర ప్రత్యంగిరా మహా మంత్ర యజ్ఞము నిర్వహించారు.  కార్యక్రమములో వివిధ పుణ్యక్షేత్రాల నుండి వచ్చిన వేద పండితుల మత్రోచ్చనల మద్య నిర్వహించారు.  చుట్టు ప్రక్కల గ్రామాలనుండే కాక దూర ప్రాంతాల నుండి వేరే  జిల్లాల నుండి వచ్చిన భక్తులకు స్వామివారి అన్న ప్రసాదము, హంపి స్వామి వారు ఆశీస్సులు అందుకున్నారు.  ఆలయ ధర్మకర్తలు భువన గంగా ప్రసాదు దీక్షితులు మాట్లాడుతూ వచ్చే పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కోటిలింగేశ్వర స్వామికి 108 కలశాలచే కుంభాభిషేకము, సహస్ర ప్రత్యంగిరా మంత్ర యజ్ఞము పూర్ణాహుతి ఉంటుందని తెలిపారు.  కార్యక్రమంలో, ప్రత్యేక పూజలో, పూర్ణాహుతిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపనుపొందాలని కోరారు.

More articles

Latest article