పరకాల పట్టణంలో కానరాని అభివృద్ధి

Must read

పరకాల పట్టణంలో కానరాని అభివృద్ధి
–ఆధకార, ప్రతిపక్ష నాయకుల వైఫల్యం
–రేవూరి ప్రకాష్ రెడ్డి
జీన్యూస్​ పరకాల
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల వైఫల్యం కారణంగా పరకాల పట్టణం అభివృద్దికి ఆమడదూరంలో నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పగడాల కాళీ ప్రసాద్ రావు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ ముఖ్య నాయకుల సమావేశం బుదవారం పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంలో పరకాలకు జిల్లా విభజనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. పరకాల ప్రాంతం అభివృద్ధి లేక మెయిన్ రోడ్ లో ఉన్న షాపులు ఖాళీగా ఉన్నాయని, టూలెట్​ బోర్డులతో దర్శనం ఇస్తున్నాయన్నారు. 100 పడకల ఆసుపత్రి పనులు ఇంకా నత్త నడకనే కొనసాగుతున్నాయన్నారు. పాత పోస్టుమార్టం రోడ్ ను డెవలప్ చేయాలని డిమాండ్​ చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని కట్టిన బంగ్లా నిరిగిపయోగంగా ఉండడం వలన అసాంఘిక కార్యకలాపాలకు మారిందన్నారు. పరకాల దామెర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్ డిపో నిర్మాణం అప్ గ్రేడియేషన్ అధునీకరణలో 108.20 కోట్ల అనుమతులు వచ్చాయని, అందులో పరకాల పేరు లేకపోవటం బాద కలిగించిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో పరకాల గడ్డమీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని, దీనికోసం నాయకులు, కార్యకర్తలలో కలసి కార్యచరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిరింగి సంతోష్ కుమార్, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ మోర్చాల నాయకులు, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article