నూతనంగా ఎన్నికైన సర్పంచ్​, వార్డుమెంబర్లకు సన్మానం

Must read

నూతనంగా ఎన్నికైన సర్పంచ్​, వార్డుమెంబర్లకు సన్మానం
జీ న్యూస్​ కరీంనగర్​ రూరల్​
కరీంనగర్​ మండలం నల్లగుంటపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికయిన సర్పంచ్ వడ్లూరి అంజయ్య, ఉప సర్పంచ్ తమ్మననవేని రవిందర్ యాదవ్, గ్రామ వార్డు సభ్యులకు తెలంగాణ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో బుదవారం జిల్లా కార్యాలయంలో సన్మానించారు. తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్, జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజేయ్ లు వారిన ఘనంగా సన్మానించారు. వార్డ్ మెంబర్లు వడ్లూరి వనజ- సతీష్, వడ్లూరి వనిత ప్రశాంత్, విజ్జగిరి రాజు, అట్లా నరసయ్య యాదవ్, కాశి పాక శ్వేతా రాజేందర్, మమత ఎల్లయ్య యాదవ్, అమ్మిగల్ల శ్రీనివాస్ తదితరులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తోటి కార్మికులు సర్పంచి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ గా గెలిచినందుకు సంతోషం గా ఉందన్నారు. సమాజంలో గ్రామస్థాయి నుండి ఎదగాలని. కార్మికులను గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మంచి పరిపాలన అందించాలని ప్రజలు మెచ్చుకునే పరిపాలన తీసుకురావాలని గ్రామ శాఖలో మీ వంతు సేవలు అందించాలని వారిని కోరారు. జిల్లా అధ్యక్షులు కాశి పాక అజయ్ మాట్లాడుతూ పూర్తిగా గ్రామంలో సేవ చేసినప్పుడే సంతృప్తి చెందుతుందని గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించాలన్నారు. గ్రామంలో మంచి యువతను ఎంచుకున్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారు కోరి శ్రీనివాస్, మహిళా రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మీరియా, జిల్లా నాయకులు లలిత, ముత్యం అశోక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కార్మిక నాయకుడు గందే కొమురయ్య ముదిరాజ్, తడిగొప్పుల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article