విద్యార్థులకు మార్గదర్శకులు ఉపాధ్యాయులే….

Must read

విద్యార్థులకు మార్గదర్శకులు ఉపాధ్యాయులే

పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి 

జీ న్యూస్​ నడికుడ

విద్యార్థులకు మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని, వారు నేర్పిన పాఠాలే వారి భవితకు బంగారు బాటలవుతాయని పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి అన్నారు.  నడికూడ మండలం కౌకొండ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓడపల్లి విజయకుమార్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం బుదవారం జరిగింది.  ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞాన ప్రసూనాంబ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పిఆర్టియు హన్మకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మండల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరిలు హాజరయ్యారు.  తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పాధ్యాయ వృత్తి పవిత్రమైందని, ప్రతీ విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయంగా మిగిలి పోతుందన్నారు.  ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, ఉద్యోగ ని ర్వహణలో ఆయన చేసిన సేవలు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాయన్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యో గుల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా కష్టతరంతో కూడుకున్నదని,  విద్యార్థుల భవిష్యత్ దిశా నిర్దేశం చేయడంలో కీలకంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విజయకుమార్ చేసిన సేవలను ఆయన కొ నియాడారు. అనంతరం విజయకుమార్ ని ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి  హన్మంతరావు, నడికూడ మండల శాఖ అధ్యక్షుడు అచ్చ సుదర్శన్, కమలాపూర్ మండల శాఖ అధ్యక్షుడు పటేల్ శ్రీనివాస్ రెడ్డి, మండల శాఖ మహిళా ఉపాధ్యక్షురాలు వింజమూరి మనోరమ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article