తల్లి పేరు మీద సేవలు గొప్ప విషయం
మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం
జిన్యూస్ బోద్
తల్లి పేరు మీద సేవలు చేయటం గొప్ప విషయమని, తన తల్లి మాసం లక్ష్మీ జ్ఞాపకార్థకం మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ స్థాపించి అమ్మ పేరు మీద సేవలు చేస్తున్న అనిల్‌ను బోథ్ సర్పంచ్ అన్నపూర్ణ, ఎంపిడిఓ రమేష్ లు అభినందించారు. సోమవారం మండల కేంద్రం లోని గ్రామపంచాయితీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రమేష్, సర్పంచ్ అన్నపూర్ణలు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ రమేష్ మాట్లాడుతూ మాసం అనిల్ యొక్క ప్రతి సేవ కార్యక్రమం లో నేను అతిథిగా వెళ్ళానని, గత సంవత్సరం కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని, ఇలాగే మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. బోథ్ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ మాట్లాడుతూ మాసం అనిల్ సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. చిన్న వయసులో తల్లి పేరు పెద్ద పెద్ద సేవ కార్యక్రమాలు చేయడం గొప్ప అని అభినందించారు. ఇలాంటి సాయాజిక కార్యక్రమాలు మరిన్ని చేయాలని, తాను సర్పంచ్ అయిన తరువాత మొదటి కార్యక్రమం ఇదే అయినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ పుండ్రు విజయ లక్ష్మీ, పంచాయితీ కార్యదర్శి అంజయ్య, మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్, వార్డు సభ్యులు మేడిచెల్మ రూప ప్రవీణ్, కరిపే శ్రీనివాస్, బిట్లింగ్ గిరీష్ , మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కుట్టు మిషన్ నిర్వాహకురాలు శ్రీజ, సన్నీ రెడ్డి, గ్రామపంచాయితీ సిబ్బంది, కుట్టు మిషన్ శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.
