పసుల రవికుమార్ కు అభినందన వెల్లువ
జీ న్యూస్ కరీంనగర్
ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, సామాజిక సేవకుడు, లఘు చిత్రాల నటుడు, దర్శకుడు పసుల రవికుమార్‌ను పలువురు సీని కళాకారులు అభినందించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ సరిగమ మ్యూజిక్ స్టూడియో ఆడిటోరియంలో ..నీరజ ఓరుగల్లు స్వరాలజల్లు అధ్యక్షురాలు నీరజ ఆద్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పసుల రవి కుమార్ ను సినిమా నటుడు కమెడియన్ పృథ్విరాజ్ తదితరులు అభినందించారు. సినిమా పాటల గేయ రచయిత లు గాయకులు ప్రణయ్ కుమార్, చైతన్య అర్జున్,మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ తదితరుల చేతుల మీదుగా సన్మానాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవలు చేస్తూ పసుల క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రవికుమార్ కళాకారుడిగా రానిస్తున్నాడన్నారు. ఆయన నిర్మించే, దర్శకత్వం వహించే ప్రతి లఘు చిత్రాలలో సమాజానికి ఉపయోగపడే ఇతివృత్తం ఉండేలా చూస్తూ ఉంటాడని అభిందించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ యూట్యూబ్ లో లఘు చిత్రాలు చేస్తూ స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించి వారిలోని నటనకు ప్రోత్సాహమిస్తున్నానన్నారు. సందేశాత్మకమైన, సామాజిక చైతన్యాన్ని కలిగించే లఘు చిత్రాలు తీయడంలో తృప్తి ఉంటుంన్నారు.
