దేశం కోసం ప్రాణలు ఆర్పించిన త్యాగదనుల పార్టీ కాంగ్రెస్ పార్టీ
– సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రణవ్.
జీ న్యూస్ హుజురాబాద్:
దేశం కోసం ప్రాణలు ఆర్పించిన త్యాగదనుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మండల పరిధిలోని శాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పని చేసిందని,అదే స్పూర్తితో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి హయంలో సంక్షేమ అభివృద్ధి విషయంలో దేశంలోనే తెలంగాణ రైజింగ్ పేరుతో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం ముందుకు దూసుకు వెళ్తుందన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రణవ్..
పరిస్థితి బాగోలేక ఆసుపత్రులపాలైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ జమ్మికుంట వీణవంక ఇల్లందకుంట మండల,పట్టణ పరిధిలోని 73 మంది లబ్ధిదారులకు 25లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు తీసుకున్న వారు వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని లబ్ధిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

