విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలి

Must read

విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలి

జీ న్యూస్​ తిమ్మాపూర్​

విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలని ఎంపిడీఓ రాజీవ్​ మల్​హోత్ర అన్నారు.  తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య –శ్రీనివాస్,  ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర లు శనివారం జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రకాలుగా వసతులను కలిగిస్తూ వారు అన్ని రంగాల్లో ముందుకు సాగడానికి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేలా  పాఠశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలన్నారు. క్రీడాకారులకు, పాఠశాల విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, అప్పుడే విద్యార్థులు శారీరక సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ సందర్బంగా నుస్తులాపూర్ గ్రామానికి చెందిన యువకులు, క్రీడాకారులు వ్యాయామం, అథ్లెటిక్స్ తదితర క్రీడలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ యువత క్రీడలలో ముందుకు సాగేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వారికి అదికారులు, ప్రజాప్రతినిథులు హామీ ఇచ్చారు.

More articles

Latest article