మామడ తండాలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మానం

Must read

మామడ తండాలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మానం

జి న్యూస్ లోకేశ్వరం 

మామడ మండల కేంద్రానికి చెందిన మామడ తండాలో గ్రామపంచాయతి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తండా వాసులు ఘనంగా సన్మానించారు. మామడ గ్రామ సర్పంచ్ పందిరి చంద్రకళ సూరి, ఉపసర్పంచ్ గోవర్ధన ప్రవీణ్ రమణ బావయ్య, వార్డు సభ్యులకు శాలువాలు కప్పి సన్మానం చేశారు.  తండా వాసులు, ముఖ్యంగా లంబాడీ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలతో ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తండా వాసులు మాట్లాడుతూ, మామడ తండా అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తాగునీరు,అంతర్గత రహదారులు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, కాలనీల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నూతన సర్పంచ్ పందిరి చంద్రకళ సూరి మాట్లాడుతూ, తండా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు,మహిళలు, యువకులు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article